Ts-set-2025″ టీఎస్‌-సెట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

ts set

Ts-set-2025″  హైదరాబాద్‌,  
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే టీఎస్‌ సెట్‌ (Telangana State Eligibility Test) – 2025 దరఖాస్తు గడువును పొడగించినట్లు సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ బి. శ్రీనివాస్‌ ప్రకటించారు.

అభ్యర్థులు ఏ విధమైన అపరాధ రుసుము లేకుండా నవంబర్‌ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
తదుపరి తేదీలు మరియు అపరాధ రుసుములు క్రింది విధంగా ఉన్నాయి:

  • రూ.1500 అపరాధ రుసుముతో: నవంబర్‌ 14 వరకు

  • రూ.2000 అపరాధ రుసుముతో: నవంబర్‌ 19 వరకు

  • రూ.3000 అపరాధ రుసుముతో: నవంబర్‌ 21 వరకు

అభ్యర్థులు నవంబర్‌ 26 నుంచి 28 వరకు తమ దరఖాస్తులను ఎడిట్‌ (Edit Application) చేసుకునే అవకాశం ఉంటుంది.

హాల్‌టికెట్లు (Hall Tickets) డిసెంబర్‌ 3వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్షలు డిసెంబర్‌ రెండో వారంలో నిర్వహించబడనున్నాయి.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు 040-27097733, 8331040950 నంబర్లను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

Samsung Galaxy Watch6 Classic – ఆధునిక జీవనానికి నూతన స్మార్ట్ భాగస్వామి

Monthcyclone” క‌చ్చీర్ ముచ్చ‌ట్లు..మొంథాయ్ తుఫాన్ ఈడిదాకా అత్త‌దాయే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *