Monthcyclone”
ఎమోయి ఎల్లన్న ఎటువోతన్నవే..
పొలం కాడికిపోతన్ననే మల్లన్న
పొలం కోసినవాయే ఎల్లన్న
ఏడకోసిన్నే.. ఇంకా పదనున్నదని ఆగినా.. ఇగ రెండు రోజుల ఎవలదన్న మిసినతోని
కోపియ్యాలే మల్లన్న
పండితే పండుగ లేకపోతే దండుగానే మన రైతులది ఎల్లన్న
ఏమైందే..
మళ్లా తుఫాన్ లేచిపాడియిందే ఎల్లన్న
హా అవునాయే.. పంటచేతికొచ్చినంకా ఎప్పుడైనా గిట్లనే అయితంది.. కోసి కొనేకాడ కల్లాల్ల పోద్దామను
కుంటే మళ్లాపోపైందాయే మల్లన్న ఈ వాన.. ఎప్పుడు లేచింది. ఏడెడ వానలుపడుతయే..
తెలంగాణాల బాగాచోట్ల పడుతాయటనే పేపర్లల్ల, టీవీలల్ల అత్తందే.. ఈ తుఫాన్ పేరు మొంథా అని పెట్టిర్రు. తీరంవైపు దూసుకొత్తదట. సోమవారం పొద్దుగాలయ్యే సరికి తుఫాన్‌గా మారుతదని వాతావరణం అధికారులు చెప్పిరట…
అవునాయే మల్లన్న… మనతెలంగాణా ఏజిల్లాల్లో బాగపడుతదే..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణశాఖోళ్లు చెప్పిరటనే.
ఇయి కాకుండా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతాయట
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. పట్నంలో కూడా వానలు పడుతాయట.
ఇయ్యాల ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణమోళ్లు చెప్పారటా. .
30 తారీఖు తర్వాతే వానలు తగ్గుముఖం పడుతాయటే ఎల్లన్న
అయ్యే రామా..! పొలం కోసుడు అడనేపోతదాయే మల్లన్న.. రైతు కట్టం ఏటికేడు దిగజారుడే కానీ ఎదిగింది లేదే మల్లన్న.. మన రైతు బతుకులు గింతేనే.. కొడితే బాగా వానలు కొడుతయ్ .. లేకపోతే కరువువొచ్చి నిండాముచ్చుతయే కదా మల్లన్న
మల్లన్న గీ గురించి ఫోన్ గురించే తెలుసుకునేది ఉంటే కింది లింక్ పై క్లిక్ చేయండి..
Sony Xperia 1 VI” ఇది నిజంగా ప్రొఫెషనల్ ఫోన్“సోనీ తిరిగి వచ్చేసింది!
