Tspsc-Chairman” తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్లు లీక్ కావడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే చైర్మెన్ సహా సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రావడంతో (Tspsc Chairman) చైర్మెన్ కొంత మంది సభ్యులు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాడ్డాక కొన్ని రోజులకు (Tspsc Chairman) ఛైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రిజైన్ చేశారు. తరువాత ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లెటర్లను గవర్నర్‌కు పంపించారు. అప్పటి నుంచి ఈ రాజీనామాలు గవర్నర్ తమళిసై వద్దే పెండింగ్ లో ఉన్నాయి. బుధవార 10 జనవరి 2024న వాటిని గవర్నర్ ఆమోదించారు. దీంతో టీఎస్‌పీఎస్సీ కొత్త (Tspsc Chairman) ఛైర్మన్, సభ్యుల నియమాకానికి లైన్ క్లియర్ అయింది. నూతన సభ్యుల నియమాకం తరువాత ఉద్యోగుల నోటిఫికేషన్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.
Also read
జిల్లాలను కుదిస్తారా…? ఏఏ జిల్లాలు పోతాయి..