తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే కొత్త జిల్లాల డిమాండ్ ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మాజీ ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో జిల్లాల ఆవశ్యకతను గుర్తు చేశారు. రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రెండెండ్ల తరువాత కొత్త జిల్లాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 జిల్లాలుగా ఉండగా కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ జిల్లాలపై అప్పుడే కొత్త వ్యతిరేకత వచ్చింది.
మరో మారు చర్చల్లోకి ..
తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో మారు జిల్లాలను పునర్వవ్యవస్థీకరించాలని భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటినుంచే కాంగ్రెస్ లీడర్లు జిల్లాలపై పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి కరీంనగర్లో విలీనం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలకోసమే హుస్నాబాద్‌ను సిద్దిపేటను కలిపారని జిల్లాలను పునర్వవ్యవస్థీకరణ చేయాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ టీవ చానెలకు ఇచ్చిన ఇంటర్వూలోనూ జిల్లాల ఏర్పాటుపై కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ప్రజా అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు.
ఏఏ జిల్లాలు పోతాయి..
జిల్లాలు కుదిస్తే ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అనేది చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రం నుంచి దూరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా.? జిల్లా పరిధిలో జనాభా ప్రతిపాదికగా తీసుకుంటారా అనేది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరో వైపు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిని జిల్లాలు గా చేయాలనేది కూడా కొంత మంది వాదన. అలా చేస్తే కొన్ని మండలాలు జిల్లా కేంద్రాలకు ఎక్కువ దూరంలో ఉంటాయి.. 20 నుంచి 23 వరకు జిల్లాలు ఏర్పాటు చేస్తే బాగుంటందని ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు. తక్కువ విస్తీర్ణం, తక్కువ జనాభా ఉన్న జిల్లాలు విలీనమవుతాయనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.
ఒక నియోజకవర్గం ఒక్క జిల్లాలోనే..
ఒక నియోజకవర్గం ప్రస్తుతం రెండు మూడు జిల్లాలో విస్తరించి ఉన్నది. ఇటువంటి నియోజకవర్గాలను ఒక జిల్లాలోనే ఉండాలని భావిస్తున్నారు
కొన్ని గ్రామాలు…
కొన్ని గ్రామాలు ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండి మరో జిల్లాలో ఉన్నాయి. దీనికి కారణం ఆ గ్రామం ఉండే మండల కేంద్రం మరో జిల్లా కేంద్రానికి దగ్గర ఉండటమే. ఇటువంటి గ్రామాల్లోని ప్రజలు తమను దగ్గర ఉండే జిల్లాలో విలీనం చేయాలని ఎప్పటి నుండో వేడుకుంటున్నారు.
గతంలో 37 రెవెన్యూ డివిజన్లుండగా వాటిని 74కు పెరిగాయి.. 464 మండలాలను 607 పెంచారు. మండలాల ఏర్పాటులో ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని అవలంబించలేదనే విమర్శలున్నాయి. నాలుగైదు గ్రామాలతో కూడిన మండలాలు సైతం ఉండటం అప్పట్లో అనేక విమర్శలకు తావిచ్చింది.
పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..
ముగ్గురు మంత్రుల సస్పెన్షన్.. భారత్‌లో సంబరాలు.. అసలేం జరిగింది…