పోటీపరీక్షలు నిర్వహించే టీఎస్‌పీఎస్సీ సంస్థను వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. పేపర్ల లీక్, కొన్ని పరీక్షల రద్దు మరికొన్ని పరీక్షల వాయిదా పడ్డాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ పై విమర్శలు వెల్లువెత్తాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణాలో ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారందరూ రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ కూడా సోమవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఆతరువాత సీఎస్ శాంతికుమారికి సమాచారం అందించారు. అంతకంటే ముందు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. జనార్ధన్ రెడ్డి 2021 మే నెలలో టీఎస్ పీఎస్సీ చైర్మెన్ బాధ్యతలు స్వీకరించారు.
మాజీ సీఎంను పరామర్శించిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటుడు చిరంజీవి