Ap inter topper” బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇప్పుడు టాపర్‌గా నిలిచిన బాలిక

Ap inter topper"

Ap inter topper”  ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి బాల్య‌వివాహం చేయాల‌ని భావించిన త‌ల్లిదండ్రుల‌ను ఎదురించి ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాల్లో టాప‌ర్‌గా నిలించింది. కర్నూలు జిల్లా ఆదోని మండలానికి చెందిన ఎస్. నిర్మల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను సాకుగా ఆమెకు చిన్న‌త‌నంలోనే వివాహం చేయాల‌ని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో నిర్మ‌ల వివాహం నుంచి తప్పించుకోగా జిల్లా యంత్రాంగం రక్షించి ఆలూరు కేజీబీవీలో చేర్పించారు. ఏపీ ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల బాగా చదువుకుని బైపీసీలో 440మార్కుల‌కు గాను 421 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆయ‌న ప్రశంసించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Ys Sharmila”మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం… వైఎస్ ష‌ర్మిల

Accident At Hyderabad” హైదరాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Lion Viral Video” సింహాల‌ను బెదిరించిన ముంగీస‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *