ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్సు
తెలంగాణలోని సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్ సి ఎస్ఎఫ్ సారంగాపూర్ గత పాలకుల తప్పుడు విధానాల ఫలితంగా చక్కెర ఫ్యాక్టరీ మూత పడిందని, ఆ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్సు డిమాండ్ చేశారు.
సిరికొండ మండల కేంద్రంలోని గడ్కోలు గ్రామంలో ఏఐకేఎంఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కారల్ మర్క్స్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఎన్ సి ఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు. ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా రైతుల అప్పులన్నీ మాఫీ చేసి రైతులను రుణ విక్తులను చేయాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీ తేరుస్తామని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటి వరకు 9 ఏండ్లు గడిచినా తెరిపించలేదని తెలిపారు. అక్టోబర్ 3న ఇందూరు పరస్పర సహకార చక్కెర సంఘం, చెరుకు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐకేఎంఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన ప్రజలనూ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్,గ్రామ అధ్యక్షుడు గులాంహుస్సన్,కమిటీ సభ్యులు కృష్ణ ,రాంజీ,ఉషన్న, పీ వై ఎల్ మండల అధ్యక్షులు మల్కి సంజీవ్ గంగారెడ్డి నడిపిసాయన్న.శివరాజ్, గంగయ్య. తదితరులు పాల్గొన్నారు,
సెప్టెంబర్ 1 నాటికి రూ.3.32 లక్షల కోట్లు.. మరో నాలుగు రోజులే గడువు