Vande Bharat Coach” వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభిస్తుండటంతో, రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏడుప్రధాన మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
ప్రస్తుతం 16 కోచ్‌లతో నడుస్తున్న సికింద్రాబాద్–తిరుపతి, మంగళూరు సెంట్రల్–తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్–తిరునల్వేలి రైళ్లను 20 కోచ్‌లకు విస్తరించనున్నారు. అలాగే, మరో నాలుగు మార్గాల్లో 8 కోచ్‌ల రైళ్లను 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ మార్పులతో కోచ్‌ల పెంపు పొందే ఇతర మార్గాలు:
మదురై – బెంగళూరు కాంటోన్మెంట్
దేవ్‌గఢ్ – వారణాసి
హవ్డా – రౌర్కెలా
ఇందోర్ – నాగ్‌పూర్
రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ ఆర్థిక సంవత్సరం (జూలై 31, 2025) నాటికి మరిన్ని 20 కోచ్‌ల వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేవడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా తయారవుతున్న కోచ్‌లు, కొత్త మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్ల కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
Lava Play Ultra 5G: లిమిటెడ్ టైం ఆఫర్ లో … అద్భుతమైన ఫీచర్లతో కేవలం ₹14,998కే!
