Karimnagar” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
1975 నుంచి 1977 వరకు దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులను కరీంనగర్ మాజీ ఎంపీ, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం ఘనంగా సన్మానించారు.
కరీంనగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో, మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి చెందిన కన్నాపూర్ గ్రామస్తుడు భూపతి కృష్ణమూర్తి తో పాటు ఇతర గ్రామాల ఎమర్జెన్సీ పోరాటయోధులకు శాలువాలు కప్పి, ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
