Nimisha-priya” మాఫీ అనే మాట ఉండ‌దు.. నిమిషా ప్రియ ఉరిశిక్ష‌పై స్పందించిన మెహ్దాని సోద‌రుడు..

nimisha priya

Nimisha-priya” న్యూఢిల్లీ:

2017లో కేరళ నర్సు నివిష ప్రియా యెమెన్‌లో తలాల్ అబ్దో మెహ్దీని హత్యచేసిందని ఆరోపణలపై ఆమెకు మృతి శిక్ష విధించబడిన విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో బాధితుని సోదరుడు అబ్దెల్‌ఫత్తా మెహ్దీ తీవ్రంగా స్పందించారు.

“ఈ నేరానికి మాఫీ అనే మాటే ఉండదు. నివిష ప్రియాను తప్పనిసరిగా శిక్షించాల్సిందేన‌ని అబ్దెల్‌ఫత్తా స్పష్టం చేశారు:

ఇదే సందర్భంలో, నివిష ప్రియాను బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్న భారతీయ మీడియాపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. “మీడియా వాస్తవాలను వ‌క్రీక‌రించేలా చేయడం బాధాకరం” అని అన్నారు.

నివిష ప్రియాను బుధవారం శిక్షించాల్సి ఉండగా, ఉరి శిక్ష‌ను త‌ప్పించేందుకు అనేక ప్రయత్నాల ఫలితంగా ఆమె శిక్ష తాత్కాలికంగా నిలిపివేయబడింది.

ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతుతో పాటు, సౌదీ అరేబియాలోని సంస్థలు, మద్యవర్తిత్వం కోసం చొరవ చూపిన‌ట్టు తెలిస్తున్న‌ది.

ఈ ప్ర‌య‌త్నాల వ‌ల్ల తుది ఆదేశాలు వచ్చే వరకు నివిష ప్రియా మృతి శిక్షను వాయిదా వేశారు. ఈ అయితే దీనిపై అబ్దో మెహ్దీని సోద‌రుడు పై విధంగా స్పందించారు.

అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల ఆధారంగా ఈ వార్త ప్ర‌చురించ‌బ‌డింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *