Viral Video” అడవిలో ఉండాల్సిన పులి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించిన సంఘటన కలకలం సృష్టించింది.
అడవులతో చుట్టుముట్టబడిన ప్రాంతంలోఈ పోలీస్ స్టేషన్ ఉండటంతో, వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది. సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ లోపలకి చిరుతపులి వచ్చినట్టు కెమెరాలో రికార్డ్ చేయబడింది. అదృష్టవశాత్తూ, పోలీసులు చిరుతపులికి చిక్కకుండా తప్పించుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
నడువట్టం పోలీస్ స్టేషన్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. దీని కారణంగా, అడవి జంతువులు తరచుగా తిరుగుతాయి. చిరుతపులి ప్రవేశించిన సమయంలో పోలీస్ స్టేషన్ లో కొంతమంది పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారు. వారు తమ పని చేసుకుంటుండగా, చిరుతపులి లోపలికి వచ్చి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది.
అదృష్టవశాత్తూ, పోలీసులు చిరుతపులికి చిక్కకుండా తప్పించుకున్నారు. చిరుతపులి వెళ్లిన తర్వాత పోలీసు తలుపు మూసివేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. చిరుతపులి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిందని కొంతమంది సరదాగా కామెంట్లు రాసుకొస్తున్నారు.