తన లవర్ తో గొడవపడిన యువకుడు మనస్థాపం చెంది బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా మీడియా విభాగంలో శ్రేష్ట తివారీ అనే 24 ఏండ్ల యువకుడు పనిచేస్తున్నాడు. తివారి నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం తివారీ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ఉన్నప్పుడు ఆ యువతితో వీడియో కాల్ మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూనే అక్కడే ఉరి వేసుకున్నాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి తలుపు పగలగొట్టి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Check Also
Study Table స్టడీ ఫోల్డబుల్ టేబుల్ జస్ట్ రూ.499కే
Study Table స్టడీ కోసం రెల్లాన్ ఇండస్ట్రీస్ స్టడీ టేబుల్ స్టడీ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ టేబుల్ పోర్టబుల్ & లైట్ …