జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాగా..వణ్య ప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాటారం మండల పరిధిలోని నస్తూర్‌పల్లిలో చోటుచేసుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని పై అధికారులకు విచారణ ఆదేశించారు. కరెంట్ తీగలు ఎవరు అమర్చారో తెలుసుకునే పనిలో దర్యాప్తు చేస్తున్నారు.నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందింది. కానిస్టేబుల్ ప్రవీణ్ మరికొందరు సిబ్బందితో కలిసి అడవిలో కూబింగ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి కరెంట్ షాక్ ట్రాప్ వేసిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కానిస్టేబుల్ మృతి విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు పోవడం విచారకరమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరెంట్ వైర్లు వేసిన దుండగులను పట్టుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
Young Farmers” 45 ఏండ్లు వచ్చిన పెండ్లి కావడం లేదు.. ప్రోత్సాహకంగా రూ. 5 లక్షలివ్వండి
తెలంగాణాలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Hukka Ban” తెలంగాణాలో హుక్కా నిషేధం