Zp Highschool” తిమ్మాపూర్ మండలం, నుస్తులాపూర్ — గ్రామంలోని జడ్పీ హై స్కూల్ 1995–96 బ్యాచ్ విద్యార్థుల పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి అప్పటి గణిత ఉపాధ్యాయులు శ్రీ కే. మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మధురానుభూతులు పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసి, గురుపూజ నిర్వహించారు. గురుదక్షిణగా తమ కృతజ్ఞతలు ప్రకటించారు.
విద్యార్థులు మాట్లాడుతూ – “ఆ రోజుల్లో చదువులు ఉద్యోగాలు కల్పించకపోయినా, జీవితానికి అవసరమైన సంస్కారాలు, విలువలు మాత్రం పాఠశాల బోధనల ద్వారానే రూఢీబడ్డాయి” అని భావోద్వేగంగా తెలిపారు.
ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఇలాంటివే సమ్మేళనాలు నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల బృందం ఒక అభిప్రాయానికి వచ్చింది.
ఈ సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నవారిలో:
-
ఎం.ఏ. మతీన్
-
అనంతోజు శ్రీకాంత్
-
జ్యోతి
-
జగదీశ్వరాచారి
-
తణుకు మహేష్
-
షఫీయొద్దీన్
-
ఎల్. కుమార్
-
రాజమల్లు
-
అంజని
-
రాజ్ కిరణ్
-
అంజలి
-
సదానందం
తదితరంగా మొత్తం 50 మంది పూర్వ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
