మహారాష్ట్రలో ఘటన
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర లోని థానే జిల్లా షహపూర్ సమీపంలో నిర్మిస్తున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణ పనుల్లో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు నిర్మాణంలో వాడే గర్డర్ అనే యంత్రం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న 16మంది కార్మికులు మృతి చెందారు. ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. యంత్రంలో చిక్కుని గాయపడిన వారిని హాస్పటల్‌కు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.