Local news” టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు …
గణేష్ సేవలు అభినందనీయం…
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే తెలంగాణ జన సమితి లక్ష్యం అని, టీజేఎస్ జిల్లా కన్వీనర్ మోరె గణేష్ సేవలు అభినందనీయమని, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. టీజెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో టీజేఎస్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ మోరె గణేష్ తో కలిసి ఉచిత అంబలి కేంద్రాన్ని ముక్కెర రాజు ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రగతి కోసం, అంతం కోసం టీజేఎస్ ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటు ఫలాలు ప్రజలందరికీ దక్కడానికిని, రాజ్యాంగం లో పొందుపర్చబడ్డ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వం లో అలుపెరుగని కృషి చేస్తామన్నారు. జిల్లా కన్వీనర్ గా నియామకమైన యువకుడు మోరె గణేష్ సేవలు అభినందనీయమన్నారు. జిల్లా కన్వీనర్ మోరె గణేష్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తా నన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అడక్ కమిటీపార్లమెంట్ సభ్యులు మోరె ప్రభాకర్ యువజన సమితి జిల్లా నాయకులు నెలవేణి రమేష్, రజక సంఘం మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి నాంపెల్లి శంకరయ్య, సామాజిక కార్యకర్త మవూనూరు గణేష్ , గాజుల శ్యామ్, దాసరపు శివ సాయి, కోరపల్లి శివ ప్రసాద్, అంతడుపుల తిరుపతి, ఆశా వర్కర్ జహీదాబేగం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వివక్ష తగదు..
అర్హులైన అందరితో మండల కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం..
బిజెపి జిల్లా అధికార ప్రతిని సమ్మిరెడ్డి…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వివక్ష తగదని, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ పేరుతో కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా అర్హులను ఎంపిక చేస్తూ అర్హులైన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని బిజెపి పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ అధ్యక్షతన మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో ఇందిరమ్మ కమిటీ పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందన్నారు. కేవలం ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులకు సిఫారసు చేసిన జాబితానే అధికారులు సర్వే చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సమ్మిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ ఇండ్లు మంజూరు చేస్తామని చేసిన వాగ్ధానం రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దొంగల రాములు, దాసరపు నరేందర్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, చెర్ల శ్రీనివాస్, గూళ్ళ రాజు, గుర్రం శ్రీనివాస్, అమరగొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.