ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ సిటీలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని ఏన్ ఏడీ జంక్షన్ వద్ద ఈ క్యాష్ ను విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఓ ఆటోలో వాషింగ్ మెషిన్ను తరలిస్తున్నారు. ఆ వాషింగ్ మిషన్‌లో డబ్బు కట్టలు ఉంచి తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అందులో సుమారు రూ. 1.30 కోట్లు ఉన్నాయి. నగదుతో పాటు 30 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సరైన ఆధారాలు చూపలేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన డబ్బును విజయవాడ తరలించారు.
ఆర్మూర్‌లో 302 రైస్ కుక్కర్లు పట్టుకున్న అధికారులు
ఎన్నికల కోడ్ ను అధికారలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేస్తూ ఓటర్లును ప్రలోభాలకు లోనుకాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఎలాంటి అధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బు, బంగారం, వెండి, ఇతర విలువగల వస్తువులను సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా 302 రైస్ కుక్కర్లను ఎన్నికల అధికారుల పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
8సార్లు ట్రాక్టర్ పోనిచ్చి దారుణ హత్య