తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో 22 బాక్సుల్లో రూ. 42 కోట్ల రూపాయలను తరలిస్తున్నో ఓ లారీని కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఈ డబ్బును తెలంగాణాకు తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఇది కాకుండా మరో రూ. 8 కోట్లను కర్ణాటక నుంచి తెలంగాణా రాష్ట్రానికి తరలించినట్టు అధికారులు గుర్తించారు. నగదు పట్టుకున్న తరువాత కేసును ఈడీ బదలాయించారు. అయితే బెంగుళూరు నుంచి బైరే సంద్రకు లారీలో డబ్బును తరలించి, బైరే సంద్ర నుంచి ఏడు కార్లలో తెలంగాణాకు తరలించేందుకు నిందితులు పథకం పన్నినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణాలో ఓ పార్టీ ఖర్చుల కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి ఇవికూడా
డబ్బుల వివాదం.. అత్తను గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు
పశువులు అమ్ముతానని చెప్పి.. కండ్లల్లో కారం కొట్టి.. రూ. 80 వేలు అపహరణ