ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే 8 మంది మృతి చెందడం విషాదం నింపింది. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో 88 మంది దుర్మరణం చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్ జరిగి ముగ్గురు, కడప జిల్లాలోని పందిళ్లపల్లి వద్ద లారీ బైక్ ఢీ కొని ఇద్దరు, ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద మున్నేరు వాగు నీటిలో మునిగి ముగ్గురు చనిపోయారు. ఆయ ఘటనలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానం వద్ద ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తు ఇటుక లోడ్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని తాళ్లరేవు మండలం రచ్చవారిపేటకు చెందిన ఓలేటి శ్రీను (28) , ఒలేటి రాజు (26) ఎదుర్లంక గ్రామానికి చెందిన పాలేపు ప్రసాద్ (24) గుర్తించారు. మరో యువకుడు శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి.
మరో ఘటనలో ఇద్దరు..
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పందిళ్లపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చనిపోయిన వారిని బింగి (31) మహేశ్, బింగి చిన్న(29) మోహన్ గా గుర్తించారు. వీరు తాపీ మేస్త్రీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పనులకు వెళ్తున్న సందర్భంగా పందిళ్లపల్లి వద్ద లారీ అదుపు తప్పి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు.
నీటిలో మునిగి ముగ్గురు……….
ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు వాగులో ఈతకు దిగి ముగ్గరు మృతి చెందారు. సరదాగా ఈత కొట్టేందుకు ఐదుగురు యువకులు నీటిలో దిగారు. లోతు తెలియకపోవడంతో ఐదుగురు గల్లంతయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి వారిని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు మృతి చెందారు. మిగిలిన ముగ్గురిని నందిగామ గవర్నమెంట్ దవాఖానాకు తరలించారు. చనిపోయిన వారు ఐతవరం గ్రామానికి చెందిన చెజర్ల దినేశ్, యడవల్లి గణేశ్, గాలి సంతోష్ కుమార్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
విమానం కారు ఢీ వీడియో మీరు చూడండి
తల్లి కండ్ల ముందే పిల్లలు మృతి మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
ఆరు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టిన లారీ.. 30 కిలోమీటర్లు ఈడ్చుకెల్లి..