బాణా సంచా పేలుడులో 9 మంది మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు గ్రామాల్లోని ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. కమ్మపట్టి గ్రామంలో ఒకటి, శివకాశీలో గ్రామంలో మరో పేలుడు జరిగింది. ఒకే రోజు ఒకే జిల్లాలో రెండు చోట్ల పేలుళ్లు జరగటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కమ్మపట్టి గ్రామంలోని బాణా సంచా పరిశ్రమలో పేలుడులో ఐదుగురు మృతి చెందారు. శివకాశీ సవిూపంలోనూ ఓ పేలుడు జరిగడంలో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు. ఈ రెండు ఘటనల్లో 9 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డట్ట సమాచారం. ఈ ఘటనలపై విచారణ సాగుతోందన్నారు. వారం రోజుల క్రితం తమిళనాడులోని అరియలూర్ జిల్లాలోనూ ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు జరిగింది. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 3లక్షల పరిహారాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
ఇవికూడా చదవండి
హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. 13 లక్షలు హాం ఫట్
షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది కదా అని.. సజ్జనార్ ట్విట్.. వీడియో వైరల్
ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బతికిండు
రిటైర్డ్ నేవి ఆఫీసర్‌కు సైబర్ వల.. రూ. 2.37 లక్షల మోసం