Indus River” సింధూ న‌దీ జ‌లాలు ర‌ద్ద‌యితే పాకిస్తాన్లో ఇదే జ‌రుగుతుంది..

Indus River”  కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి పై భార‌త్ తీవ్రంగా స్ప‌దించింది. పాకిస్తాన్‌కు బుద్ది చెప్పేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే సింధూ న‌దీ జ‌లాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

సింధూ న‌ది టిబెట్‌లో పుట్టి భార‌త్, పాకిస్తాన్ మీదుగా ప్ర‌వాహిస్తోంది. దీనిని ఇండ‌స్ రివ‌ర్ అనికూడా అంటారు. ఈ భార‌త్ పాకిస్తాన్‌లో మొత్తం 3,180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ మార్గంలో ఆరు ప్ర‌ధాన ఉప న‌దుల‌తో క‌లిసి సింధూ న‌ది ప్ర‌వాహిస్తుంటుంది. రెండు దేశాలు విడిపోయిన త‌ర్వాత ఇండ‌స్ న‌దీపై జ‌లాల నిర్వ‌హ‌ణ‌, ప్రాజెక్టులు క‌ట్ట‌డం, నీటిని వినియోగించుకోడం వంటి అంశాల‌పై వివాదాలు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలో 1960 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ బ్యాంక్ మ‌ధ్య‌వ‌ర్తిత్త‌త్వంతో అప్పటి భారతదేశ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్య‌క్షుడు జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ ప్ర‌కారం.. సింధు నదీ వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్ సట్లెజ్ నదులను భారత్ కు కేటాయించారు. ప‌డ‌మ‌టి భాగంలోని సింధూ, జీలం, చీనాబ్ న‌దుల‌ను పాకిస్తాన్ కు కేటాయించారు.

ఒప్పందం రద్దయితే.. ..

ప్ర‌స్తుతం సింధూ న‌ది జ‌లాల ఒప్పందం ర‌ద్ద‌యితే పైభాగాన ఉన్న ఇండియా నీటిని పాకిస్తాన్‌కు వెళ్ల‌కుండా రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్టుకోవ‌చ్చు.. ఇండియాలోని ఇత‌ర ప్రాంతాల‌కు ఆ జ‌లాల‌ను మ‌ళ్లించుకోవ‌చ్చు. ఇలాగ‌న‌క నీటిని ఆపితే పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధు ప్రావిన్స్‌లు ఎడారిగా మారే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. పాక్‌లోని అగ్రిక‌ల్చ‌ర‌ర్ ల్యాండ్‌లో 80 శాతం పంజాబ్‌, సింధు ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఈ వ్య‌వసాయ భూముల‌కు భార‌త్ నుంచి వెళ్లే సింధు నీరే అవ‌స‌రం. ఈ జ‌లాలు రాకపోతే అక్క‌డి గ్రామీణ జ‌నాభాకు ఇక్క‌ట్లు మొద‌ల‌వుతాయి. ప్ర‌ధాన న‌గ‌రాలైన కరాచీ, లాహోర్, ముల్తాన్ల‌కు తాగునీరు నిలిచిపోతుంది. ఆ దేశంలోని సింధు న‌దీ బేసిన్లో గోధుమలు, వడ్లు, చెరకు, పత్తి వంటి పంటలు పండుతాయి. దీని నుంచి పాకిస్తాన్ జీడీపీకి 25శాతం వాటా సమకూరుతోంది. ఈ సింధు న‌దీజ‌లాలు రాక‌పోతే ఆ ఏరియాలో తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళుతుంది. ఆహార కొర‌త‌, అనేక న‌గ‌రాల‌కు తాగునీటి సప్ల‌యి నిలిచిపోతుంది. జ‌ల‌విద్యుత్ కేంద్రాల‌కు నీరు నిలిచిపోతే ప‌రిశ్ర‌మ‌ల‌కు క‌రెంట్ స‌ప్ల‌య్ ఆగిపోతుంది. నిరుద్యోగం, ధ‌ర‌లు పెర‌గడం వంటివి జ‌రుగుతాయ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. కాలక్ర‌మేణా భ‌విష్య‌త్‌లో పాకిస్తాన్‌లోని సింధు న‌ది ప‌రివాహ‌క ప్రాంతం ఏడారిగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

 

Local News” భూ భారతితో రైతుల భూ సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం…

Mega DSC” మెగా డీఎస్సీ వివ‌రాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలో వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *