China” పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు.. చైనాది పాత పాటే..

China”  ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత భారత్ పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాము ఉగ్ర‌దాడి చేయ‌లేదంటూనే యుద్దానికి సిద్ద‌మ‌ని పాకిస్తాన్ ప్ర‌క‌టిస్తోంది. భార‌త్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. ఈ క్ర‌మంలో చైనా పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డుతుంద‌నే క‌థ‌నాలు  ఇంట‌ర్నేష‌నల్ మీడియాలో మీడియాలో వ‌స్తున్నాయి.ఈ ఈ మేర‌కు విదేశాంగ‌ శాఖ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ‌ మంత్రి ఇష‌క్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భార‌త్ – పాక్ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్టు పేర్కొంది. పాకిస్తాన్ ర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాల‌కు, సార్వ‌భౌమ‌త్యానికి అండ‌గా నిల‌వ‌డంతో చైనా త‌న సుదీర్ఘ‌కాల కొన‌సాగిస్తుంద‌ని వివ‌రించారు. ప‌హ‌ల్గామ్ దాడికి సంబంధించి ఉభ‌య దేశాలు స‌మయమ‌నం పాటించాల‌ని వాంగ్ యీ సూచించారు. ఉగ్ర‌వాదంపై నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తున‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు కృషిచేయాల‌ని ఆశిస్తోంద‌ని పాకిస్తాన్ మంత్రికి తెలిపినట్టు చైనా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఉగ్ర‌వాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మ‌డి బాధ్య‌త అని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఎలాంటి అవాంచ‌నీయ నిర్ణ‌యాలు తీసుకున్న రెండు దేశాల‌కు మంచిది కాద‌ని చైనా మంత్రి పేర్కొన్నారు. ప‌హ‌ల్గామ్ దాడి జ‌రిగిన రోజున ఉగ్ర‌దాడిని అవ‌మాన‌వీయ చ‌ర్య‌గా చైనా పేర్కొన్న విష‌యం తెలిసిందే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *