Karimnagar” కరీంనగర్: “సకురా” సైన్స్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.
తెలంగాణ మోడల్ స్కూల్, ఎలగందల్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శివాంజలి, రాత పరీక్ష మరియు స్క్రీన్ టెస్ట్ ద్వారా జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి కేవలం నాలుగు మంది మాత్రమే ఈ అవకాశాన్ని పొందగా, కరీంనగర్ జిల్లాకు చెందిన శివాంజలిని ఎంపిక కావడం విశేషం.
శివాంజలిని మే 24 నుండి 30 వరకు జపాన్‌లో పరిశ్రమలు, పరిశోధన సంస్థలను సందర్శించేందుకు అనుమతించబడింది.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, ప్రిన్సిపాల్ కొడిమ్యాల శ్రీనివాస్, అలాగే తల్లిదండ్రులు కరుణాకర్ మరియు శారద శివాంజలిని అభినందించారు.
