Local news” వైద్యపరంగా పేదలను ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

Local news”  మానకొెండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..
శంకరపట్నం డిసి ప్రతినిధి..


వైద్యపరంగా పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం ఎల్.ఎం.డీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదప్రజల సహాయార్థం సీఎం సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయటం సంతోషకరమన్నారు. తిమ్మాపూర్ మండలానికి 13వ విడుతలో 48 మందికి రూ. 12 లక్షల 42 వేలు మంజూరైనట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు, సుధగోని లక్ష్మినారాయణగౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, కుంట రాజేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, గొట్టిముక్కుల సంపత్ రెడ్డి, బూదారపు శ్రీనివాస్, ఎస్.కొండల రావు, కొత్త తిరుపతిరెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, దావు సంపత్ రెడ్డి, దొంత శ్రీనివాస్, చెన్నబోయిన రవి, కంది లక్ష్మినారాయణ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, రమేశ్, కాసర్ల సంపతి వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోచంపల్లి గురుకుల బాలికలను అభినందించిన ఎమ్మెల్యే.. కవ్వంపల్లి..
శంకరపట్నం డిసీ ప్రతినిధి.. 


ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ విద్యార్థినుల‌యిన‌ పిల్లి అంజలి, బాకారపు రక్షితలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సోమవారం ఎల్.ఎం.డీ కాలనీలో క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంజలి, రక్షితలు ర్యాంకులు సాధించడంపై ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ హర్షం వ్యక్తం చేస్తూ సదరు బాలికలను అభినందించారు. వేర్వేరు గ్రూపుల్లో అంజలి 500 మార్కులకుగాను 492, రక్షిత 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించడం సంతోషకరమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టపడి చదివి మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలని, తద్వారా భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు కోండ్ర సురేష్, శ్రీనివాస్ గౌడ్, కొమ్మెర రవీందర్ రెడ్డి, మాచర్ల అంజయ్య, కొత్త తిరుపతిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు,ఇంచార్జీలు బి.శ్రీనివాస్, తిరుపతిగౌడ్, శ్రీరాం శ్రీనివాస్, డాక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *