Pakistan” పాకిస్తాన్‌కు మరో దెబ్బపడ్డట్టు తెలుస్తుంది. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈక్రమంలోనే బలూచిస్తాన్‌లోని కలాట్ జిల్లాలోని మాంగోచర్ నగరాన్ని బావోచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాంగోచర్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను బలూచ్ తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.
బలూచ్ తిరుగుబాటుదారులు ప్రభుత్వ భవనాలపై ఉన్నట్టు చూపించే వీడియో శనివారం సోషల్ మీడియాలో కూడా కనిపించింది. మాంగోచర్ నగరంలోని బాలూచ్ తిరుగుబాటుదారులు మరియు పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు జరిగాయి. బలూచ్ తిరుగుబాటుదారులు నగరంలోని పాకిస్తాన్ ఆర్మీ శిబిరంపై దాడి చేశారు. తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గత కొన్ని నెలలుగా, బలూచ్ తిరుగుబాటుదారులు బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ భద్రతా సిబ్బందిపై తమ దాడిని తీవ్రతరం చేశారు. ఏప్రిల్ 26న, పశ్చిమ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన పేలుడులో కనీసం పది మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది.
