Local News” పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం..
మాజీ సర్పంచ్ భద్రయ్య…
శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
దళితుల ఆశాజ్యోతి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకష్ణ మాదిగ ను కరీంనగర్ జిల్లా నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామం తాజా మాజీ సర్పంచ్ దాసారపు భద్రయ్య మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు దళితుల ఆశాజ్యోతి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ను సికింద్రాబాద్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కరీంనగర్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి, పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సన్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు ఇంజం వెంకటస్వామి, అంతడుపుల సతీష్, కనకం శంకర్, ఓదెల రాజయ్య, సాగర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరోసారి మానవత్వం చాటుకున్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి…
కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు…
శంకరపట్నం డిసి ప్రతినిధి
మరోసారి మానవత్వం చాటుకున్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు, కుమార్తెలు.. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం,శంకర పట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన లక్ష్మి నారాయణ మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ తో 12 సంవత్సరాల నుండి మంచానికే పరిమితం అయ్యాడు. లక్ష్మీనారాయణకు, ఇళ్లు, బంగారం అమ్మి 15 లక్షలు ఆసుపత్రిలో ఖర్చు చేసి వైద్యం చేస్తున్నారు. వైద్యం ఖర్చులతో అప్పుల పాలైనారు. అప్పుల పాలు అయి డబ్బులు, కట్టకపోవడం తో ఫైనాన్స్ నిర్వాహకులు, ఇంటిని జప్తు చేయడం జరిగిందని, దీంతో లక్ష్మి నారాయణ భార్య మమత, ఇద్దరు ఆడ పిల్లలు ప్రవస్తి, ప్రశస్తి రోడ్డున పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు కరీంనగర్ కిసాన్ నగర్ లోని ఓ చిన్న రేకుల షెడ్డులో లక్ష్మి నారాయణ, కుటుంబం కాలం వెళ్లదీస్తుందని, లక్ష్మీనారాయణకు మళ్ళీ పరిస్థితి విషమించిందని, చేతిలో చిల్లి గవ్వ లేక దిక్కు తోచని స్థితిలో కుటుంబం ఉండగా, ఇటీవల వారి పరిస్థితిని ఓ టీవీ ఛానల్ టీవీ కథనం ప్రసారం చేయగా, అది చూసినా కొత్త జయపాల్ రెడ్డి ఆ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.లక్ష్మీనారాయణ వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించిన కొత్త జైపాల్ రెడ్డికి భార్య మమత, కుమార్తెలు కృతజ్ఞతలు తెలిపారు.
