Bangladesh” బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌.. మాకు సంబంధం లేద‌న్న యూన‌స్ ప్ర‌భుత్వం

Bangladesh”  ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌కు చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ భారతదేశంపై రెచ్చగొట్టే ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టును ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు సన్నిహితుడిగా పరిగణించబడే రిటైర్డ్ మేజర్ జనరల్ ALM ఫజ్లూర్ రెహమాన్ భార‌త్ పాకిస్తాన్‌పై దాడి చేస్తే భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలపై దాడి చేసి ఆక్రమించుకోవాలని పేర్కొన్నాడు.

ఈ విషయంలో, చైనాతో ఉమ్మడి సైనిక ఏర్పాటుపై చర్చలు ప్రారంభించడం అవసరమని నేను భావిస్తున్నాను” అని రెహమాన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.
గ‌త కొంత కాలంగా బంగ్లాదేశ్ భార‌త్‌తో క‌య్యానికి కాలుదువ్వుతోంది. గ‌తంలోనూ ఇలాంటి వ్యాఖ్య‌లే ఆ దేశం నుంచి విన‌బడుతోంది. అయితే ALM ఫజ్లూర్ రెహమాన్ వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు సంబందం లేద‌ని యూన‌స్ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *