Auto Drivers” శంకరపట్నం, మే 27 (డిసీ ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు సుంకరి కిషోర్ డిమాండ్ చేశారు. “అరెస్టులతో ఉద్యమాలు ఆగవు” అని హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలో, హైదరాబాదులో చేపట్టిన నిరసన ధర్నాకు బయలుదేరుతున్న ఆటో కార్మికులను కేశవపట్నం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు భరోసా ఇచ్చిందని గుర్తుచేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి ఆటో కార్మికుల ఆదాయం తీవ్రంగా పడిపోయిందని, చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయని వాపోయారు.
“ఉచిత బస్సు ప్రయాణంతో ఎన్నో ఆటో కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
✅
ఈ నిరసన కార్యక్రమంలో:
కనకం కుమార్ – మండల ప్రధాన కార్యదర్శి
ముజుబ్ ఖాన్ – జిల్లా కార్యవర్గ సభ్యుడు
పరమేశ్వర్ గౌడ్ – అంబేద్కర్ విగ్రహం చౌరస్తా అధ్యక్షుడు
ఇతర ఆటో యజమానులు, కార్మికులు పాల్గొన్నారు.
