Tshirt Donation” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
క్రీడల ద్వారా యువత మానసికంగా ఉల్లాసంగా, శారీరకంగా దృఢంగా మారుతారని మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన క్యాంప్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో, క్రికెట్ పోటీల్లో పాల్గొనే యువ క్రీడాకారులకు గట్టు తిరుపతి గౌడ్ అందించిన టీ షర్టులను పంపిణీ చేశారు.
iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్లో సంచలనం!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, యువతకు క్రీడా ప్రోత్సాహం కల్పించడంలో విశేష పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఆయన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.
కౌన్ జీతేగా క్రికెట్ పోటీలు
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న “కౌన్ జీతేగా” క్రికెట్ టోర్నమెంట్లో శంకరపట్నం మండలానికి చెందిన “చోటు 11” టీం.. కు తిరుపతి గౌడ్ టీ షర్టులను అందించారు.
iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్లో సంచలనం!
కార్యక్రమంలో పాల్గొన్న వారు:
కాంగ్రెస్ పార్టీ కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూరి సదానందం, బిజెపి మండల అధ్యక్షుడు మరియు క్రీడాకారుడు ఏనుగుల అనిల్, యువ నాయకులు గోడిశాల ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, పూరేళ్ల ప్రశాంత్, బీసీ సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
