Mla Kavvampalli” శంకరపట్నం, జూన్ 2 డిసి ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరుల ఆశయాల సాధన కోసం మనమంతా పునరంకితులం కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్.ఎం.డి కాలనీలోని ప్రజాభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన యోధులను స్మరించారు.
“యువకులు, ఉద్యమకారుల త్యాగఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోంది,”
అని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి అన్నారు.
అమరుల స్మృతికి నివాళులు అర్పిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను అప్రజాస్వామికవాదుల చేతుల్లోనుంచి రక్షించి, ప్రజాస్వామ్య పరిరక్షకులైన కాంగ్రెస్ చేతుల్లో పెట్టిన ప్రజలను అభినందించారు.
రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
-
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్
-
తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు బండారి రమేశ్
-
పార్టీ నేతలు: మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, అలువాల కోటి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, పడాల శంకరయ్య
-
ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కుంట రాజేందర్ రెడ్డి, బుధారపు శ్రీనివాస్, చింతల లక్ష్మారెడ్డి, రాములు యాదవ్
-
పోలు రాము, కొత్త తిరుపతిరెడ్డి, తమ్మనవేణి రమేశ్ యాదవ్, అట్ల అనిల్, ఓదెలు, చెప్యాల శ్రీనివాస్ గౌడ్
-
నాగిశెట్టి రాజయ్య, తోట శ్రీనివాస్, వంగల మధుసూదన్ తదితరులు

