Bhoo Bharathi” శంకరపట్నం డిసిప్రతినిధి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి – ఆర్వోఆర్ (ROR) చట్టం ద్వారా రైతులకు అనేక లాభాలు కలుగుతాయని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) రమేష్ బాబు అన్నారు.
మంగళవారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం మెట్టపల్లి గ్రామంలో తహసీల్దార్ కే. సురేఖ ఆధ్వర్యంలో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రమేష్‌బాబు మాట్లాడుతూ, గతంలో రైతులు ఎదుర్కొన్న భూసంబంధిత ఇబ్బందులను నివారించేందుకే ఈ నూతన చట్టం అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు.
iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్లో సంచలనం!
రైతులు తమ భూ సమస్యలను భూ భారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథి, ఆర్ఐలు బాలకిషన్, ప్రత్యూష, రాధా, జూనియర్ అసిస్టెంట్లు ఇలియాస్, రాజు, మహేష్, భవాని, రికార్డ్ అసిస్టెంట్లు అనిల్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.
iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్లో సంచలనం!
