Kamareddy” కామారెడ్డి జిల్లా, జూన్ 3: జీవితంలో ఎన్నో కలలతో ముందుకెళ్తున్న ముగ్గురు యువకుల భవిష్యత్ అర్థంతరంగా ముగిసింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో సోమవారం ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరి మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. ఈ ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది.
విషాదకర ఘటన వివరాలు
జిల్లాలోని ఎల్లారెడ్డి మండలానికి చెందిన మధుకర్ గౌడ్, తిమ్మారెడ్డి ప్రాంతానికి చెందిన నవీన్, సోమర్‌పేట్‌కు చెందిన హర్ష ఈ ముగ్గురు స్నేహితులు ఈత కొట్టేందుకు నిజంసాగర్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లారు. అంతకంటే ముందు సోమర్ పేటలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. అయితే ఎండ తీవ్రత భరించలేక నిజాం సాగర్‌లో ఈతకోసం దిగారు. మొదట ఈత ప్రారంభించిన కొద్ది సేపటికే వీరంతా నీటిలోతును అంచనా వేయకపోవడంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. చాలా గాలింపు చర్యల తర్వాత ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి….
కుటుంబాల్లో విషాదం
ఈ ఘటన బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. కలలు కంటూ ఎదుగుతున్న యువకుల జీవితాలు అర్థాంతరంగా ముగియడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్‌లో సంచలనం!
