Bakrid Celebrations” శంకరపట్నం డిసి ప్రతినిధి
ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని మానకొండూర్ శాసనసభ్యుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని ఈద్గాలో జరిగిన బక్రీద్ ప్రార్థనలో ఆయన ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ముస్లిం మత పెద్దలతో పాటు సమూహ ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
“బక్రీద్ పరమార్థం త్యాగం, సమర్పణ. ఖుర్బానీ అంటే కేవలం వధ కాదు, అది దైవానికి సమర్పించే మనశ్శుద్ధి, స్వార్థత్యాగం, మానవత్వానికి నడక. ఇది మానవ సంబంధాలను బలోపేతం చేసే సందేశాన్ని ఇస్తుంది,” అని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ సర్ఫొద్దీన్, ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్ పాషా, ఆలిండియా వొలామ కౌన్సిల్ అధ్యక్షుడు నదీ మొద్దీన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎండీ ఇర్ఫాన్, ముస్లిం నాయకులు ఎండీ అజీద్, ఎండీ మహమూద్, ఎండీ అజహర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, పార్టీ నాయకులు కొత్తకొండ శంకర్, కోండ్ర సురేష్, మడుపు ప్రేమ్ కుమార్, తాళ్లపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
