Mhps leader” బాధిత కుటుంబానికి ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర నేత సంపత్ చేయూత

Mhps leader”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మేకల సారయ్య మృతితో బాధపడ్డ కుటుంబాన్ని పరామర్శిస్తూ, వారికి ఆర్థిక సహాయం అందజేసినట్టు ఎంహెచ్‌పీఎస్ (మాదిగ హక్కుల పరిరక్షణ సమితి) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ మంగళవారం తెలిపారు.

మానకొండూర్ నియోజకవర్గంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన సారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో సంపత్ సారయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పుతూ, తన వంతుగా బియ్యం వంటి నిత్యవసర వస్తువులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎండి అబ్జాలుద్దీన్, ఎండి సాబీర్, చిక్కుల ఓదెలు, కొత్తపెళ్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *