Government schools”
శంకరపట్నం, జూన్ 13 (డిసీ ప్రతినిధి):
ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలనే లక్ష్యంతో అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యను అందిస్తూ కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరిగానే పాఠశాలలో మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం” అని తెలిపారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, మంచి విద్యతో పాటు ఆర్థిక భద్రతను కూడా పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కంటి చైర్మన్ జ్యోతి, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, మహిళా సమైక్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
