Eggani ramesh” సంక్షేమ పథకాలపై తప్పుడు ఆరోపణలు అసహనం వల్లే: కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎగ్గని రమేష్

Eggani ramesh” శంకరపట్నం, జూన్ 13 (డిసి ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కరీంపేట గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఎగ్గని రమేష్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గత 10 ఏళ్లలో రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ ఇవ్వనివారు, నేడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై తప్పుడు విమర్శలు చేయడం దురదృష్టకరం” అని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు బోనస్, ఉచిత బియ్యం వంటి పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నేటి నుంచే సన్న ఇసుక సరఫరా ప్రారంభమవుతోందని, ఇసుక కోసం సంబంధిత హౌసింగ్ AEలు లేదా పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి టోకెన్లు తీసుకోవాలని సూచించారు.

శంకరపట్నం మండలానికి చెందిన లబ్ధిదారులు, చల్లూరు, ఇప్పలపల్లి ఇసుక రీచ్‌లకు ట్రాక్టర్‌తో వెళ్లి నేరుగా ఇసుక తెచ్చుకోవచ్చని తెలిపారు.

అలాగే తప్పుడు ప్రచారాలు చేసే ప్రతిపక్ష నాయకులు, ప్రజల అభివృద్ధిని అంగీకరించి సత్యాన్ని Graహించాలని రమేష్ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *