Eye Donation”తల్లి నేత్రాలను దానం చేసిన తనయులు – మరొకరి జీవితానికి వెలుగు..

Eye Donation” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది తాడికల్ గ్రామానికి చెందిన వోడ్నాల కుటుంబం. తమ కన్నతల్లి వోడ్నాల సత్తమ్మ అత్తమ్మ (తాజాగా మృతిచెందారు) నేత్రాలను దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపారు. ఆమె కుమారులు, కుమార్తెలు — వోడ్నాల చంద్రమౌళి (విమల), సత్తయ్య (వనమాల), నరసింహస్వామి (రమ), జగన్ (అరుణ), వెంకటేష్ (కరుణ), మురళీ (లత), కౌసల్య — ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకుని ఆదర్శంగా నిలిచారు.

సేవాభావానికి సదాశయ ఫౌండేషన్ అభినందన:
ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, “ఇలాంటి కుటుంబాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. తల్లి మృతిలోనూ సేవా దృక్పథాన్ని చూపడం నిజంగా గొప్ప విషయం,” అని ప్రశంసించారు.

నేత్రదానానికి ప్రోత్సాహం:
సత్తమ్మ నేత్రదానానికి సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు కవిత ప్రోత్సాహం అందించారు. కుటుంబ సభ్యులు ఆమె సహకారంతో తల్లి నేత్రాలను దానం చేశారు. ఫౌండేషన్ తరఫున కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *