Strait of hormuz” హార్మూజ్ జల సంధి – ప్రపంచానికి గొంతుకోసే మార్గమా?

Strait of hormuz” ‘హార్మూజ్ జల సంధి’… “ప్రపంచంలో ఎప్పుడూ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారే ఓ కీలక సముద్ర మార్గం…
ఇరాన్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రదేశం ఇది

హార్మూజ్ జల సంధి ఇరాన్ మరియు ఒమాన్ మధ్య ఉన్న ఒక నీటిమార్గం ఇది. దీని
వెడల్పు కేవలం 33 కిలోమీటర్లే కానీ ప్రాధాన్యత మాత్రం అంతకు మించినది. ఇది ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో దాదాపు 30% కంటే ఎక్కువ రవాణా అయ్యే మార్గం. అందుకే దీనిని “చోకిపాయింట్ ఆఫ్ ద వరల్డ్” అని కూడా అంటారు.

ఈ మార్గం పురాతన హోర్మూజ్ రాజ్యానికి, సిల్క్ రోడ్‌కు ముడిపడి ఉంది. 1971లో ఇరాన్ – అభూ ముసా, గ్రేట్ & లిటిల్ టూన్బ్స్ అనే ద్వీపాలపై ఆక్రమణ చేసింది. ఇవి ఇప్పటికీ ప్రాంతీయ వివాదాలకు కారణం అవుతున్నాయి.

ఇది UN Laws of the Sea ప్రకారం ట్రాన్సిట్ ప్యాసేజ్‌కి వర్తిస్తుంది.
అంటే దేశాలు స్వేచ్ఛగా నావికా రవాణా చేయవచ్చు. కానీ, ఇరాన్ ఇంకా దీనిని పూర్తిగా రాటిఫై చేయలేదు. కొన్ని దేశాల నౌకల రాకపోకలను పరోక్షంగా నిరోధిస్తోంది.

1980–88లో ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో ఈ మార్గం వ్యూహాత్మక కేంద్రమైంది. ట్యాంకర్లపై దాడులు… అమెరికా మిలిటరీ జోక్యం…
1988లో అమెరికా నౌక USS Vincennes పొరపాటుగా ఇరాన్ యిపిండి విమానాన్ని కూల్చేసింది – 290 మంది మరణించారు.

ఇరాన్ ఈ మార్గాన్ని రక్షించేందుకు సముద్ర మైన్లు, సబ్‌మైరైన్లు, మిసైళ్లతో భారీ వ్యూహాలు రూపొందిస్తోంది. దీంతో ఇది ఒక యుద్ధస్థలంగా మారే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

హార్మూజ్ జల సంధి అనేది కేవలం ఒక నీటిమార్గం కాదు… ఇది ఓ జీవంత వ్యూహ కేంద్రం…
ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత జరిగినా, క్రూడాయిల్ ధరలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు – అన్నీ దెబ్బతింటాయి. ప్రతి రోజూ రెండు కోట్ల బ్యారెల్ల క్రూడాయిల్‌, స‌హ‌జ‌వాయువు ఇత‌ర దేశాలకు ఈ సంది గుండా వెళుతుంది.

ఈ వీడియో మీకు ఇంట్రస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ విషయాల కోసం…మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *