Tahsildar Shankarapatnam” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
శంకరపట్నం మండలానికి తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. సురేఖను, బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, “మండల అభివృద్ధికి మరియు సామాజిక సమగ్రతకు సంబంధించి అధికారుల భాగస్వామ్యం అత్యంత కీలకం,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యంఆర్పిఎస్ మండల అధికార ప్రతినిధి కోడూరి మహేష్, డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు చల్లూరి రాజేందర్, యంఆర్పీఎస్ మండల కార్యదర్శి యమునూరి నాగరాజు, చల్లూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
