Mukherjee Shankarapatnam” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ మాట్లాడుతూ, “భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన డా. శ్యామప్రసాద్ ముఖర్జీ త్యాగాలను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం జూన్ 23న బలిదాన్ దివస్ నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.
వేడుకలలో భాగంగా ముఖర్జీ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ గ్రామ గ్రామాన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, పడాల వెంకటలక్ష్మి, గూళ్ళ రాజు, అరవింద్, బిట్టు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
