shankarapatnam” తహసీల్దార్ సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన సోషల్ జస్టిస్ నేతలు

shankarapatnam”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
నేషనల్ ఉమెన్ రైట్స్ సోషల్ సర్వీస్ మరియు సోషల్ జస్టిస్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో,   శంకరపట్నం మండలానికి నూతనంగా నియమితులైన తహసీల్దార్ కె. సురేఖను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ కాల్వ మధుబాబు మాట్లాడుతూ, “తహసీల్దార్ బాధ్యతలు చేపట్టిన కే. సురేఖకు శుభాకాంక్షలు తెలుపుతూ, మండలంలోని పలు ప్రజాసంబంధిత సమస్యలపై ఆమెతో చర్చించాం,” అని తెలిపారు.

ఈ సమావేశంలో శంకరపట్నం మండల అధ్యక్షుడు కాలువ కిషన్, చిగురుమామిడి మండలాధ్యక్షుడు పచ్చిమట్ల లింగమూర్తి, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *