Si shekhar reddy” విద్యార్థులు ఉన్నత లక్ష్యాల దిశగా సాగాలి: ఎస్సై శేఖర్ రెడ్డి సందేశం

Si shekhar reddy” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తి పెంచుకొని, ఇష్టంతో అధ్యయనం చేస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రుల కలలను సాకారం చేసి, సమాజానికి ఆదర్శంగా నిలవవచ్చని కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి అన్నారు.

మంగళవారం, మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో ఉన్న మోడల్ స్కూల్‌లో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి. ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ..

“చదువే జీవిత మార్గాన్ని నిర్దేశించే మార్గదర్శక బలంగా ఉంటుంది. చెడు అలవాట్లు విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే విద్యార్థి దశ నుండే మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలి,” అని తెలిపారు.

అలాగే, విద్యార్థులు పదవ తరగతిలో మంచి జీపీఏ సాధించి ఉన్నత చదువులు కొనసాగించాలని, గ్రామానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

పతకాలు మరియు బహుమతులు:
వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి ఉపాధ్యాయులు, పాలకులు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు:

  • ప్రిన్సిపల్ వి. సరిత

  • ఉపాధ్యాయులు: రాజు, ప్రభాకర్, సతీష్ కుమార్, కనక లక్ష్మీ, నాగ లక్ష్మి, జ్యోతి, మధుకర్, మహేందర్

  • విద్యార్థులు & శిక్షక సిబ్బంది

 

Natural. Elegant. Organized.

✨ త్రీ-టియర్ వుడ్ స్పైస్ రాక్
స్పైస్ బాటిల్స్, జార్స్, & డిస్ప్లే షెల్ఫ్‌లకు
ప్యాంట్రీ క్యాబినెట్ లోనూ, కౌంటర్‌పైనూ స్టైలిష్ ఆర్గనైజేషన్
100% నేచురల్ వుడ్ ఫినిష్

మీ కిచెన్‌కు ఒక నేచురల్ టచ్ ఇవ్వండి!

స్టాక్ లో ఉంది | ఆర్డర్ చేయండి నేడు!

https://amzn.to/468GGcr లింక్‌పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *