Ambedkar Yuvajana Sangham” మాతృ సంఘంలో చేరిన దేవునూరి కిష్టయ్య

Ambedkar Yuvajana Sangham” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల సమావేశంలో శంకరపట్నం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు దేవునూరి కిష్టయ్య మాతృ సంస్థలో చేరారు.

బుధవారం మానకొండూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు క్యాదాసి భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా దేవునూరి కిష్టయ్య 50 మంది అనుచరులతో కలిసి మాతృ సంస్థలో చేరినట్టు మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ వెల్లడించారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బొజ్జ రవి, మైసాని మనోహర్, నియోజకవర్గ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఓదెలు, సీనియర్ నాయకులు క్యాదాసి భాస్కర్, బొజ్జ సుధాకర్, బొజ్జ రాజయ్య, కళ్యాణ్, గ్రామ శాఖ అధ్యక్షులు దామెర అశోక్, లింగస్వామి, తిరుపతి, సురేష్, రాజు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *