
Local news” శంకరపట్నం డిసీ ప్రతినిధి…
మోడల్ స్కూల్ ను ప్రభుత్వ ఎంపీ యుపిఎస్ పాఠశాలల విద్యార్థులు క్షేత్రస్థాయిలో సోమవారం సందర్శించినట్లు మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా శంకరపట మండలంలోని, లింగాపూర్, ఆముదాల పల్లి, రాజాపూర్, కాచాపూర్, గ్రామాల్లో గల ప్రభుత్వ ఎం పీ యు పి ఎస్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను ,ట్రైనింగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్య బోధనలు పాఠశాల ఆవరణ, పాఠశాల నిర్వహణ పై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు, పేర్కొన్నారు. ఎంపీ యుపిఎస్ విద్యా అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన, మోడల్ స్కూల్లో విద్యనభ్యసించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వి సరిత, ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజు, కనక లక్ష్మి, మహేందర్, సీఆర్పీలు తిరుపతి, శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

