Molangur”శంకరపట్నం (కరీంనగర్ జిల్లా), డిసి ప్రతినిధి:
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన పశువుల దొంగతనంతో స్థానిక రైతు చిరుత కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన సొంత వ్యవసాయ భూమి వద్ద కట్టివేసిన రెండు సూడి బర్రెలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకున్నారని ఆయన తెలిపారు.
రైతు కుమార్ వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం పశువులను పొలంలో కట్టివేసి ఇంటికి వెళ్లగా, ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూసే సరికి రెండు బర్రెలు కనిపించలేదని చెప్పారు. దొంగిలించబడిన బర్రెలు విలువ సుమారు లక్ష50 వేల వరకు లక్షలు ఉంటుందని అంచనా.
