Chintakindi kasim” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
“వర్గీకరణను సాధించి పెట్టింది ముమ్మాటికీ మంద కృష్ణ మాదిగగారే,” అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అలుగునూరులోని ఏఎంఆర్ ఉన్నత కన్వెన్షన్ హాల్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ,
30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో మంద కృష్ణ మాదిగ గారు తన యవ్వనం, కుటుంబం అన్నిటినీ త్యాగం చేసి, వర్గీకరణ సాధించేందుకు పోరాడారని గుర్తు చేశారు.
“ఈ పోరాటంలో ఎవరినీ చేయి చాచి అడగలేదు. పని చేస్తేనే బతికే జాతి మాదిగలది,” అని వ్యాఖ్యానించారు.
విద్య, ఉద్యోగం, నైతిక విలువలు అవసరం
మాదిగల బతుకులు మెరుగుపడాలంటే విద్యతో పాటు వివేకం, ఉద్యోగం, నైపుణ్యం అవసరమని, చదువు వస్తే చైతన్యం వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.
“1918లో రెడ్లు, 1939లో వెల్మ— కానీ మాదిగలకు లేదు. ఎందుకు?” అని ప్రొఫెసర్ ప్రశ్నించారు.
ఆర్థిక వ్యాప్తికి మార్గం
“డబ్బులు వస్తే బంగారం కొంటున్నారు. అది మళ్లీ వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్తుంది. అందుకే డబ్బును డబ్బుగా మార్చండి,” అని ప్రజలకు సూచించారు.
దేశాన్ని ఇప్పుడు అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ శక్తులే నడుపుతున్నాయన్నారు. పేదలకు ఉపయోగపడేలా వ్యాపారంలోకి రావాలని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రజాస్వామ్యంలో నైతిక సేవకులు కావాలి
“60 లక్షల మంది పన్నులు చెల్లిస్తే, అన్ని రంగాల్లో ఉద్యోగులు లంచం తీసుకోకుండా సేవ చేయాలి,” అని ప్రొఫెసర్ కాసిం తెలిపారు.
ఆపరేషన్ కగార్ ఉద్యమాన్ని ఒక రాజకీయ-సామాజిక పోరాటంగా గుర్తిస్తూ, లౌకికవాద పార్టీలను ప్రజలు గుర్తించి గమనించాలంటూ పిలుపునిచ్చారు.
