Ganneruvaram” డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయించండి:

Ganneruvaram”  గన్నేరువరం ప్రజల వినతులు, స్పందించిన మానకొండూర్ ఎమ్మెల్యే

శంకరపట్నం,  
గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు చేపట్టిన రూ.74 కోట్ల విలువైన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయ‌ని, ఈ రహదారి మార్గాన్ని రోజూ ఉపయోగించే స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నార‌ని మానకొండూర్ ఎమ్మెల్యేకు విన్న‌వించారు.

ఈ నేపథ్యంలో బుధవారం గన్నేరువరం మండల ప్రజలు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఆయన ఎల్ఎండీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి సమస్య వివరించారు.

పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజలు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ విజ్ఞప్తిని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సానుకూలంగా స్వీకరించారు. సమస్య తీవ్రతను గమనించి వెంటనే సంబంధిత మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల నుంచి నిధుల మంజూరుకు హామీ లభించడంతో, త్వరలోనే పనులు మళ్లీ ప్రారంభమై పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిణామంతో గన్నేరువరం ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.

ఈ సమావేశంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, అలువాల కోటి, జె. మన్మోహన్ రావు, మాతంగి అనిల్, కట్కం తిరుపతి, నర్సింహారెడ్డి, మైసంపల్లి తిరుపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *