కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్-2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో జిల్లా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. మొత్తం 44 విభాగాల్లో పోటీపడగా, వివిధ క్రీడల్లో కలిపి 55 మెడల్స్ సాధించడం విశేషం.
79.4 పాయింట్లతో మెరిసిన కరీంనగర్
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సాగిన ఈ క్రీడా సమరంలో కరీంనగర్ జిల్లా క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి 79.4 పాయింట్లను సొంతం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా జిల్లా క్రీడాకారులు విజేత కప్‌ను అందుకున్నారు.
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ చిత్రా మిశ్రా
విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, కోచ్‌లు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌లను, కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల సిబ్బందిని మరియు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి, యోగ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిధారెడ్డి మరియు కోచ్‌లు పాల్గొన్నారు.
అయ్యో తల్లీ.. మూడేళ్ల కొడుకుతో కలిసి బావిలో దూకి తల్లి ఆ*త్మహ*త్య
గ్యాస్ ఏటీఏం ప్రారంభం..వంటగ్యాస్ కష్టాలకు చెక్: దేశంలోనే తొలి ‘LPG ATM’
కరీంనగర్ జిల్లాలో విషాదం: లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
బాధితుల వద్దకే పోలీస్ సేవలు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ ప్రారంభం
