Nationwide Strike”సార్వత్రిక సమ్మె విజయవంతం – నల్ల చట్టాలను రద్దు చేయాలి: సిపిఐ, సిపిఎం నేతలు

Nationwide Strike” శంకరపట్నం, జూలై 9 (డిసి ప్రతినిధి): దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని, కార్మికుల మరియు కర్షకుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య మరియు సిపిఎం మండల కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తూ, 44 నల్ల చట్టాలను రూపొందించి 4 కోడులుగా విభజించడం కార్మికుల పొట్టపై ప్రహారమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను అమలు చేయకుండా పాత నిబంధనల్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అలాగే, జీవో నంబర్ 282ను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 గా నిర్ణయించాలని, భవన నిర్మాణ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నది వారి డిమాండ్.

ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయని, విభిన్న వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేశారని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు రేగుల కుమార్, దేవయ్య, కొనగంటి శ్రీనివాస్, బూర్తుల శ్రీనివాస్, తిరుపతి, రామస్వామి, మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి రజిత, రాజేశ్వరి, బొజ్జ సాయిలు, ఎస్టీ బాబా, చక్రపాణి, మల్లేశం, సారయ్య, రాజమణి, లలిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *