Jaguar Crash” భారత వైమానిక దళ‌ విమానం ప్రమాదం… ఇద్దరు పైలట్లు మృతి

Jaguar Crash”  రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ (IAF Jaguar Crash 2025)  ట్రెయినర్ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో భనోడా గ్రామంలోని వ్యవసాయ భూముల్లో ఈ ప్రమాదం జరిగింది. (Indian Air Force plane accident)

ఈ ఘటనపై IAF స్పందిస్తూ, “ఒక సాధారణ శిక్షణ మిషన్‌లో (Rajasthan Churu Plane Crash)  ఉన్న జాగ్వార్ ట్రెయినర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పౌర ఆస్తికి ఎలాంటి నష్టం జరగలేదు” అని X ( Twitter) ద్వారా వెల్లడించింది.

IAF ఈ మృతులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (అన్వేషణ కమిటీ) నియమించినట్లు తెలిపింది. (Fighter jet crash India)

ఇది మూడో ప్రమాదం

(Indian Air Force news Telugu) గమనించదగిన విషయం ఏమిటంటే, ఇది మార్చి నెల తర్వాతి మూడవ జాగ్వార్ ప్రమాదం. మార్చి 7న హర్యాణాలోని అంబాలా సమీపంలో జరిగిన ఒక ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఇది జాగ్వార్ లు ఎంత ప్రమాదకరంగా మారిపోతున్నాయో సూచించేది.

అదే విధంగా, ఏప్రిల్ 3న గుజరాత్‌లోని జామ్నగర్‌లో మరో జాగ్వార్ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాద సమయంలో ఆయన మరో పైలట్‌ను సురక్షితంగా బయటపడేలా చేసి, విమానాన్ని జనసాంద్రత ఉన్న ప్రాంతానికి దూరంగా దారి మళ్లించడం ద్వారా అనేక మందిని ప్రాణాపాయానికి  గురికాకుండా విశేష సాహసం చేశారు.

మించిపోయిన వయస్సు?

జాగ్వార్ జెట్లను 1979లో భారత వైమానిక దళం లోకి తీసుకొచ్చింది. ఇవి తక్కువ ఎత్తులో దాడులు చేయగల శక్తివంతమైన ఫైటర్ బాంబర్లు. భారత్ ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తుండగా, ప్రపంచంలో ఇతర దేశాలు – బ్రిటన్, ఫ్రాన్స్, నైజీరియా, ఒమాన్, ఈక్వడార్ – ఇప్పటికే వాటిని పదేళ్ళ క్రితమే విరమించాయి. చాలా జాగ్వార్ విమానాలు ఇప్పుడు మ్యూజియమ్‌లలో ప్రదర్శనగా ఉన్నాయి.

HAL (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) వాటిని లైసెన్స్ ఆధారంగా తయారుచేసింది. ప్రస్తుతం IAFలో RAF జెట్లు, HAL తేజస్ Mk2, మరియు కొత్త MRFA (మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్)  తీసుకురావ‌డంలో  ఆలస్యాలు కారణంగా జాగ్వార్‌ల వయస్సు మించి పోయినా వాటి సేవా కాలాన్ని పొడిగించాల్సి వస్తోంది.

IAFలో ప్రస్తుత పరిస్థితి కూడా ఆందోళనకరం. 42.5 స్క్వాడ్రన్ల అవసరం ఉన్నప్పుడు, 30 స్క్వాడ్రన్లకే పరిమితం అయ్యింది. గత జాగ్వార్ ప్రమాదాల్లో అనేక సందర్భాల్లో ఇంజిన్ ఫెయిల్యూర్‌ కారణంగా ప్రమాదాలు జరిగాయని విచారణల్లో తేలింది, ఇది ఈ విమానాలు ఇక సేవలకు పనికిరావని చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *